Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బంగ్లాదేశ్ ప్ర‌ధాని రాక‌పై అనిశ్చితి..

    Author VENKATESH | 22 Aug 2026, 11:34 AM | NATIONAL
    బంగ్లాదేశ్ ప్ర‌ధాని రాక‌పై అనిశ్చితి..

    బంగ్లాదేశ్ ప్ర‌ధాని తారిఖ్ రెహ్మాన్భార‌త ప‌ర్య‌ట‌న‌పై అనిశ్చితి నెల‌కొంది. ఆగ‌స్టు చివ‌రి వారంలో రెహ్మాన్ ఇండియాకు రావాల్సి ఉండ‌గా.. అధికారికంగా మాత్రం ఆయ‌న రాక‌పై ఇంకా స్ప‌ష్ట‌త లేదు. బంగ్లా ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి త‌మ‌వ‌ద్ద తాజా స‌మాచారం లేద‌ని శుక్ర‌వారం భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్ర‌తినిధి ర‌ణ్‌ధిర్ జైస్వాల్ మీడియాతో పేర్కొన్నారు.దౌత్య సంబంధాల బ‌లోపేతం కోసం బంగ్లాదేశ్ ప్ర‌ధాని తారిఖ్ రెహ్మాన్ తొలిసారి భార‌త్‌లో ప‌ర్య‌టిస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నా షెడ్యూల్ మాత్రం ఖ‌రారు కాలేదు. ఢిల్లీకి బంగ్లా ప్ర‌ధాని వ‌స్తున్నారా? అనే ప్ర‌శ్న‌కు శుక్ర‌వారం భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్ర‌తినిధి ర‌ణ్‌ధిర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ‘నావ‌ద్ద స‌మాచారం లేదు’ అని చెప్పారు. ‘బంగ్లాదేశ్ ప్ర‌ధాని భార‌త ప‌ర్య‌ట‌నపై నేను చెప్పాల్సిందేమీ లేదు. తాజా స‌మాచారం ఏదైనా ఉంటే నేను మీకు తెలియ‌జేస్తాను’ అని జైస్వాల్ వెల్ల‌డించారు.