Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం కేసు

    Author VENKATESH | 20 Aug 2026, 07:01 PM | ANDHRA PRADESH
    సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం కేసు

    సంగం డెయిరీ.. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సంగం డెయిరీ నెయ్యి సరఫరా చేస్తోందని, అయితే పాల సేకరణ చేయకుండానే నెయ్యి సరఫరా చేస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలను సంగం డెయిరీ తీవ్రంగా ఖండించింది. వాస్తవాలను కప్పిపుచ్చి తమ సంస్థ ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారని పిటిషన్‌లో పేర్కొంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో సంగం డెయిరీ రైతుల నుంచి ఆవుపాలను సేకరిస్తోందని, అందుకు సంబంధించిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆరోపణలు చేశారని తెలిపింది. టీటీడీకి నెయ్యి సరఫరా విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని సంగం డెయిరీ ఆరోపించింది.