Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యావ్యవస్థలోని లోపాలు, సమాజంలో పెరిగిన అనైతికతకు బలైన ప్రిన్సిపాల్ శ్రీమతి రూపారెడ్డి గారి మరణం అత్యంత విచారకరం.

    Author VENKATESH | 20 Aug 2026, 02:32 PM | TELANGANA
    విద్యావ్యవస్థలోని లోపాలు, సమాజంలో పెరిగిన అనైతికతకు బలైన ప్రిన్సిపాల్ శ్రీమతి రూపారెడ్డి గారి మరణం అత్యంత విచారకరం.

    అక్షర యోధురాలికి అశ్రు నివాళి జ్ఞానాన్ని పంచాల్సిన విద్యాలయం లో నేరప్రవృత్తి పెరిగింది. సంస్కారానికి చోటేలేదు. హింస రాజ్యమేలింది. సమాజంలో నైతిక విలువల పతనం ఎంతటి ఘోరానికి దారితీసిందో చెప్పడానికి ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారి విషాదాంతమే నిదర్శనం.
    గురువును దైవంగా భావించే దేశంలో, అదే గురువు విద్యార్థుల చేతిలోనే బలికావడం మన విద్యావ్యవస్థకు, సమాజానికి పట్టిన పీడకల.విద్యావ్యవస్థలో లోపాలుర్యాంకుల వేట: నేటి విద్య కేవలం మార్కులు, ర్యాంకుల చుట్టూనే తిరుగుతోంది.నైతికత లోపించడం: పాఠ్యప్రణాళికలో మానవీయ విలువలు, సంస్కారానికి ప్రాధాన్యత కరువైంది.
    వ్యాపారీకరణ: విద్య ఒక వ్యాపారంగా మారి, క్రమశిక్షణను విస్మరిస్తోంది.
    సామాజిక అనైతికత సహనం కోల్పోవడం: నేటి యువతలో ఓపిక, తప్పును ఒప్పుకునే గుణం నశిస్తున్నాయి.
    హింసాత్మక ధోరణి: సామాజిక మాధ్యమాలు, సినిమాల ప్రభావంతో హింస వైపు ఆకర్షితులవుతున్నారు.
    బాధ్యతారాహిత్యం: తల్లిదండ్రులు పిల్లలకు కేవలం సదుపాయాలు కల్పించడమే కాకుండా, మంచి ప్రవర్తనను నేర్పడంలో విఫలమవుతున్నారు. తల్లిదండ్రులు పడుతున్న కష్టం విలువ కూడా తెలిసేలా చేయాలి, నేర్పించాలి.
    మేల్కొనాల్సిన సమయం రూపారెడ్డి గారి ఆత్మకు నిజమైన శాంతి కలగాలంటే కేవలం కన్నీరు పెడితే సరిపోదు.
    చట్టాలు మారాలి, విద్యావ్యవస్థలో సంస్కరణలు రావాలి.
    ప్రతి పాఠశాలలోనూ, ఇంట్లోనూ మార్కుల కంటే ముఖ్యం మంచితనం అని నేర్పాలి. శారీరక శ్రమ . క్రీడలపై పైన శ్రద్ధ వల్ల నాయకత్వ లక్షణాలు ముఖ్యమని భావించాలి ఇటు ఇంట్లో తల్లిదండ్రులు ,పాఠశాల లో ఉపాధ్యాయులు , సినిమాలు కాదు చూసేది మైదానం లో ఆటలు ఆడాలి అని,ఆటలు ఆడేలా విద్యార్థులను ప్రోచహించాలి.
    గురు బ్రహ్మ అన్న మాటకు మళ్లీ గౌరవం తెచ్చేలా సమాజం మారాలి. రూపారెడ్డి గారి పవిత్ర ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ..🙏🙏🙏ఆమె కుటుంబానికి మా సానుభూతిని తెలియజేస్తున్నాము.
    మీ
    షేక్ షబ్బీర్ అలీ
    రాష్ట్ర అధ్యక్షులు
    తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్(TPTF)
    9966733283