Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అనకాపల్లి జిల్లాలో BARC ప్రాజెక్టుకు రిలీఫ్..

    Author VENKATESH | 20 Aug 2026, 01:15 PM | ANDHRA PRADESH
    అనకాపల్లి జిల్లాలో BARC ప్రాజెక్టుకు రిలీఫ్..

    అనకాపల్లి జిల్లాలో చేపట్టనున్న BARC ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రాజెక్టు కోసం భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అనకాపల్లిలో 4,950 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌కు ఫీజులను మినహాయిస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. తొలి దశలో అచ్చుతాపురం, మునగపాక మండలాల్లోని 1,947.225 ఎకరాల భూములకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు వర్తించనుంది. అనంతరం మిగిలిన భూములకు కూడా దశలవారీగా ఈ రాయితీని రెవెన్యూ శాఖ వర్తింపజేయనుంది.