Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ధ‌నంజ‌య‌, దినుషా హాఫ్ సెంచ‌రీలు

    Author VENKATESH | 19 Aug 2026, 01:11 PM | Sports
     ధ‌నంజ‌య‌, దినుషా హాఫ్ సెంచ‌రీలు

    భార‌త్‌, శ్రీలంక మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టు ఆస‌క్తిక‌రంగా మారింది. ధ‌నంజ‌య డి సిల్వా, సోన‌ల్ దినుషాలు ప్ర‌స్తుతం పిచ్‌లో పాతుకుపోయ్యారు. ఆ ఇద్ద‌రూ హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేశారు. 372 టార్గెట్‌తో నాలుగో రోజు బ్యాటింగ్ చేప‌ట్టిన శ్రీలంక 4 వికెట్లు కోల్పోయిన 84 ర‌న్స్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ ఆఖ‌రి రోజు కావ‌డంతో.. మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప్ర‌స్తుతం అయిదో వికెట్‌కు ధ‌నంజ‌య, దినుషాలు కీల‌క భాగ‌స్వామ్యాన్ని అందించారు. ఆ ఇద్ద‌రూ హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేశారు. విజ‌యానికి భార‌త్‌కు ఆరు వికెట్లు అవ‌స‌రం కాగా, శ్రీలంక బ్యాట‌ర్లు మాత్రం ల‌క్ష్యం దిశ‌గా క‌దులుతున్నారు.