Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 4 వికెట్ల దూరంలో ఇండియా విక్ట‌రీ

    Author VENKATESH | 19 Aug 2026, 01:00 PM | Sports
     4 వికెట్ల దూరంలో ఇండియా విక్ట‌రీ

    శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో.. విక్ట‌రీకి ఇండియా ద‌గ్గ‌రైంది. మ‌రో నాలుగు వికెట్లు తీస్తే ఇండియా విజ‌యాన్ని న‌మోదు చేయ‌నున్న‌ది. అయిదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక .. భోజ‌న విరామ స‌మ‌యానికి 6 వికెట్ల న‌ష్టానికి 175 ర‌న్స్ చేసింది. ప్ర‌స్తుతం దినుషా 65 ర‌న్స్ చేసి క్రీజ్‌లో నాటౌట్‌గా నిలిచాడు. ఇవాళ ఉద‌యం ధ‌నంజ‌య‌, దినుషాలు కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. ఆ ఇద్ద‌రూ అయిదో వికెట్‌కు 95 ర‌న్స్ జోడించారు. భార‌త బౌల‌ర్లు అయిదో వికెట్ కోసం తీవ్రంగా శ్ర‌మించారు. ధ‌నంజ‌య 59 ర‌న్స్ చేసి జ‌డేజా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఇంకా రెండు సెష‌న్ల ఆట మిగిలి ఉండ‌గా, శ్రీలంక విజ‌యానికి 197 ర‌న్స్ చేయాల్సి ఉంది. భార‌త జ‌ట్టు త‌ర‌పున ఇవాళ ఉద‌యం జ‌డేజా, ప్ర‌సిద్ధి కృష్ణ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.