Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 22ఏ భూముల విషయంలో మంత్రి పొంగులేటి క్షమాపణలు..

    Author VENKATESH | 17 Aug 2026, 09:05 PM | TELANGANA
    22ఏ భూముల విషయంలో మంత్రి పొంగులేటి క్షమాపణలు..

    సెక్షన్ 22ఏ భూముల విషయంలో చెలరేగిన వివాదంపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. ప్రజలకు క్షమాపణలు చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై వివరణ ఇచ్చారు. అధికారుల వల్లే తప్పు జరిగిందని, వారి తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఈ వివాదానికి అధికారులే కారణమంటూ తప్పిదాన్ని వారిపై తోసే ప్రయత్నం చేశారు.ప్రైవేటు భూముల్ని నిషేధిత సెక్షన్ 22ఏ కింద చేర్చారంటూ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల నుంచి దీనిపై 750 దరఖాస్తులు వచ్చాయన్నారు. తమ భూముల్ని అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయని చెప్పారు. దీంతో ఈ అంశంపై నాలుగు జిల్లాల అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ‘‘సెక్షన్ 22ఏ భూములపై మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల అధికారులతో చర్చలు జరిపాం. ప్రస్తుతం ఈ జాబితాలో చేర్చిన భూములు గతంలో యూఎల్‌సీ జాబితాలో ఉండేవి. అయితే, నిషేధిత భూముల జాబితాను అప్‌డేట్ చేసే క్రమంలో పొరపాటు జరిగింది. ఇది అధికారుల నుంచి జరిగిన పొరపాటు. వారి తరఫున మేం క్షమాపణలు కోరుతున్నాం.