Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఐపీఎల్ ఆటగాళ్ల ట్రేడింగ్‌ పారదర్శకత ఉండాలి

    Author VENKATESH | 17 Aug 2026, 01:39 PM | Sports
    ఐపీఎల్ ఆటగాళ్ల ట్రేడింగ్‌ పారదర్శకత ఉండాలి

    ఐపీఎల్ ట్రేడింగ్ వ్యవస్థపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ట్రేడింగ్ వ్యవస్థలో పారదర్శకత కొరవడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో ఫ్రాంచైజీల మధ్య జరిగే ఆటగాళ్ల బదిలీలు, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలను బహిర్గతం చేయాలని ఆయన బీసీసీఐని కోరారు. తన ‘మిడ్-డే’ కాలమ్‌లో గావస్కర్ ఈ అంశంపై బీసీసీఐకి స్పష్టమైన విజ్ఞప్తి చేశారు.ఐపీఎల్‌లో సాధారణంగా జరిగే వేలం (Auction) పద్ధతికి భిన్నంగా ఆఫ్‌సీజన్‌లో ఫ్రాంచైజీలు నేరుగా ఆటగాళ్లను ట్రేడ్ చేసుకుంటుంటాయి. అయితే, ఈ ప్రక్రియలో ఆటగాడిని కొనుగోలు చేసిన ధర లేదా ఆర్థిక వివరాలు కేవలం సంబంధిత రెండు ఫ్రాంచైజీలు, ఆటగాడికి, అలానే బీసీసీఐకి మాత్రమే తెలుస్తున్నాయని గావస్కర్ గుర్తుచేశారు. దీనివల్ల మిగతా జట్లకు ఆ సమాచారం తెలియక, అవి నిర్దేశిత వేతన నిబంధనలను పాటిస్తున్నాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.