Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ‘ఓటుకు నోటు’ పితామహుడే చంద్రబాబు.. మహిళలకు నీతులు చెప్పడం సిగ్గుచేటు

    Author VENKATESH | 16 Aug 2026, 06:25 PM | ANDHRA PRADESH
     ‘ఓటుకు నోటు’ పితామహుడే చంద్రబాబు.. మహిళలకు నీతులు చెప్పడం సిగ్గుచేటు

    రాజకీయాల్లో ‘ఓటుకు నోటు’ సంస్కృతికి పితామహుడు చంద్రబాబు నాయుడే అని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా విమర్శించారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడు మహిళలు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారంటూ వారికి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని తీవ్రంగా మండిపడ్డారు. డబ్బుతో రాజకీయాలు నడిపిన చరిత్ర ఉన్న వ్యక్తి.. మహిళలను డబ్బుకు అమ్ముడుపోయేవారిగా చిత్రీకరించడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. చంద్రబాబు మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.నగరిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన రోజా.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహిళలను తన నివాసానికి పిలిచి భోజనం పెట్టిన అనంతరం వారిని అవమానించేలా చంద్రబాబు మాట్లాడారని ఆరోపించారు. ఎన్నికల్లో మహిళలు ఓటుకు రూ.2 వేలు తీసుకున్నారని, అలాంటి వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోయారన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. “మీరు రూ.2,000 ఓటుకు తీసుకుంటే.. ఆ తీసుకున్న వ్యక్తి రూ.2 లక్షలు సంపాదించాలనుకుంటాడు.. మీకు ఎలా మంచి చేయగలుగుతాడు?” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలను ఎవరు ఏది ఇస్తే అది తీసుకునే వారిలా మాట్లాడటం వారి ఆత్మగౌరవాన్ని అవమానించడమేనన్నారు.
    ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నుంచి ‘ఓటుకు నోటు’ వరకు..చంద్రబాబు తన రాజకీయ చరిత్రను గుర్తు చేసుకున్న తర్వాతే మహిళలకు నీతులు చెప్పాలని రోజా అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సమయంలో ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడానికి డబ్బును ఉపయోగించారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో చోటుచేసుకున్న ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో చంద్రబాబు ఆడియో, వీడియోలతో సహా దొరికిపోయారని రోజా విమర్శించారు.