Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    Author VENKATESH | 16 Aug 2026, 11:34 AM | నల్గొండ
    దేవరకొండలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    దేవరకొండ 15ఆగస్టు (BVK 3 న్యూస్ ) : భారతీయ జనతా పార్టీ దేవరకొండ మండల కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు శ్రీ నేనావత్ రాము నాయక్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
    ​ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకుర్ నరసింహ, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు వినోద్ రాథోడ్ మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను ప్రతి భారతీయుడు నిత్యం స్మరించుకోవాలని అన్నారు. దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
    ​దేశభక్తి, జాతీయ ఐక్యత, ప్రజాసేవా భావాలను ప్రతి ఒక్కరిలో పెంపొందించుకోవాలని, “దేశం ముందు – మనం తర్వాత” అనే స్ఫూర్తితో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.
    ​ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు, మండల నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.