Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తంగేడు మైదానంలో అట్టహాసంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

    Author VENKATESH | 16 Aug 2026, 11:31 AM | ములుగు
    తంగేడు మైదానంలో అట్టహాసంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

    * సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం


    - చిన్నారుల ప్రదర్శనల్లో వెల్లివిరిసిన జాతీయ స్ఫూర్తి

    - జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క.

    ఇవి కూడా చదవండి

    ములుగు, జిల్లా ప్రతినిధి,
    ఆగస్టు 15(బీవీకే న్యూస్):

    సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని,రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి,జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసేలా అట్ట హాసంగా జరిగాయి. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దనసరి అనసూయ సీతక్క త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు చేపడుతు న్నామని పేర్కొన్నారు. జిల్లాలో వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు.అనంతరం స్వాతంత్ర సమరయోధుల ను ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు,ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో, జడ్పీహెచ్ఎస్ ములుగు,పి ఎంశ్రీ టిజి మోడల్ స్కూల్ బండారుపల్లి,బ్రహ్మణి విద్యాలయం,టిజిఎస్ డబ్ల్యూఆర్ఎస్/జెసి (బాలికల)ములుగు,బాలసదనం చిన్నారులు, విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి,జాతీయ సమైక్యతను చాటిచెప్పే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.చిన్నారుల ప్రదర్శనలు ఆహూతులను అలరించడంతో పాటు ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించాయి. విద్యార్థులను మంత్రి,జిల్లా కలెక్టర్,ఉన్నత అధికారులు ప్రత్యేకంగాఅభినందించారు.అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రదర్శన స్టాళ్లను మంత్రి సందర్శించారు.ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాచ్ కేకన్,డిఎఫ్‌ఓ వికాస్ మీనా,అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు,అదనప ఎస్పీ సదానందం,గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్,మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి,ఆర్డీఓ కృష్ణవేణి,డిఆర్ఓ రవి కుమార్,ఆత్మ కమిటీ ములుగు డివిజన్ చైర్మన్ రవీందర్ రెడ్డి,జిల్లా అధికారులు,ప్రజాప్రతి నిధులు,ఉద్యోగులు, విద్యార్థులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.