Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

    Author VENKATESH | 16 Aug 2026, 11:22 AM | నల్గొండ
    మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

    దేవరకొండ 15ఆగస్టు (BVK 3 న్యూస్ ) : మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) దేవరకొండలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ సి సి క్యాడేట్ల చేస్తా గౌరవ వందనం స్వీకరించిన కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం అన్ని విధాలుగా అభ్యున్నతి సాధిస్తుందని ఈ దేశంలో మనం ఈరోజు స్వేచ్ఛ వాయువులను పిలుస్తూ ఇంత ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నామంటే దానికి ఎందరో మహానుభావులు దేశ స్వాతంత్రం కోసం పోరాడారన్నారు వారందరినీ స్మరించుకొని వారి త్యాగాన్ని గుర్తు చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే దేశంలోని ప్రతి ఒక్క పౌరులు కూడా వ్యక్తిగత అభివృద్ధి చెందాలని విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొంది దేశానికి మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. తదనంతరం వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జి.కోటయ్య అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జి. లింగారెడ్డి, డాక్టర్ కె.పృథు, డాక్టర్ ఎం.ప్రభాకర్, డాక్టర్ కె. రేణుక, డాక్టర్ వి. మకట్లాల్ తదితర అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.