Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

    Author VENKATESH | 14 Aug 2026, 10:02 PM | నల్గొండ
    ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

    తల్లిదండ్రులు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో తమ పిల్లల భవిష్యత్ కోసం కష్టపడతారని, చెడు అలవాట్లకు దూరంగా నిర్దేశించిన లక్ష్యాలతో ఇష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోదాడ‌ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా కోదాడలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులతో కలిసి అల్పాహారం భుజించారు. ఈ సందర్భంగా వారిని ఆత్మీయంగా పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను కూడా చిలుకూరులో హైస్కూల్ స్థాయిలో ప్రభుత్వ హాస్టల్లోనే ఉండి చదువుకుని ఈ స్థాయికి వచ్చానని, అందువల్ల ఇక్కడి కష్టసుఖాలు ఎంటో వ్యక్తిగతంగా తెలిసిన వాడినని తెలిపారు.