Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండలో మానవత్వం చాటుకున్న బిఆర్ఎస్ నాయకులు బిల్యా నాయక్

    Author VENKATESH | 14 Aug 2026, 03:54 PM | నల్గొండ
    దేవరకొండలో మానవత్వం చాటుకున్న బిఆర్ఎస్ నాయకులు బిల్యా నాయక్

    దేవరకొండ 14ఆగస్టు (BVK 3 న్యూస్ ) : కష్టకాలంలో పలకరించే ఆత్మీయ పలకరింపు జీవితాంతం గుర్తుండిపోతుందని, ఆపదలో ఉన్నప్పుడు భరోసానిచ్చే మనుషుల కంటే గొప్ప బలం మరొకటి లేదని దేవరకొండకు చెందిన బీఆర్ఎస్ పార్టీ (2001) నాయకులు, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు, భక్త మార్కండేయ దేవస్థానం కార్యవర్గ సభ్యులు మాకం చంద్రమౌళి పేర్కొన్నారు.
    ​అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి చేరుకున్న తన కూతురిని, దేవరకొండ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ బిల్యా నాయక్ స్వయంగా వారి నివాసానికి విచ్చేసి ఆప్యాయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా కూతురి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యం కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి, మనోధైర్యం కల్పించిన శ్రీ బిల్యా నాయక్ గారికి చంద్రమౌళి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలిపారు.