Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ కాపీరైట్ వివాదం..

    Author VENKATESH | 13 Aug 2026, 12:31 PM | Cinema
    ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ కాపీరైట్ వివాదం..

    ప్రభాస్ హీరోగా 2011లో విడుదలై ఘన విజయం సాధించిన క్లాసిక్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ వివాదానికి సంబంధించి ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత దిల్ రాజుపై ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణను పునఃప్రారంభించాలంటూ రచయిత్రి ముమ్మూడి శ్యామల రాణి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కాపీరైట్ వివాదంలో దిల్ రాజుకు అనుకూలంగా గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్‌పై ఉన్న స్టే అధికారికంగా యథావిధిగా కొనసాగనుంది. ఈ తీర్పుతో దిల్ రాజుకు చట్టపరంగా భారీ ఊరట లభించినట్లయింది.