Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • లోక కళ్యాణం కొరకు శ్రీ సుదర్శన నారసింహ హోమం

    Author VENKATESH | 09 Aug 2026, 09:00 PM | ANDHRA PRADESH
    లోక కళ్యాణం కొరకు శ్రీ సుదర్శన నారసింహ హోమం

    - శ్రీ క్షేత్రం దేవస్థానం ఆలయ అర్చకులు పొడిచెట్టి శేషాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహణ
    ములుగు జిల్లా ప్రతినిధి,
    ఆగస్టు 09(బీవీకే న్యూస్):
    ములుగు జిల్లా కేంద్రంలో గల శ్రీ క్షేత్రం దేవస్థానంలో ఆదివారం శ్రీ సుదర్శన నారసింహ హోమయాగంను ఆలయ అర్చకులు పొడిశెట్టి శేషాచార్యులు,వేద పండితులు కొండపాక కృష్ణ మాచార్యులు,ముడుంబా హరికృష్ణ ఆచార్యులు వేద మంత్రాల మధ్య ఆధ్యాత్మిక శోభతో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వర్తించారు.ఈ సుదర్శన హోమం వల్ల దృష్టి దోషం నరదృష్టి వంటి ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయ ని విశ్వసిస్తారు.శత్రు భయం ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని విశ్వాసం. ఆరోగ్య రక్షణ శారీరక మానసిక శ్రేయస్సుకు ఉపకరిస్తుందని నమ్మకం. ఆర్థిక స్థిరత్వం ఐశ్వర్య అభివృద్ధికి అనుకూలమని భావిస్తారు.భయం ఆందోళన తగ్గి మనశ్శాంతి ధైర్యం కలుగుతాయని చెబుతారు అలాగే ఇల్లు కుటుంబానికి దైవ రక్షణ లభిస్తుందని కూడా విశ్వసిస్తారు అని, మరెన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగు తాయని భాగ్యనగర్ వేద పండితులు కొండపాక కృష్ణ మాచార్యులు తెలిపారు.ఈ సుదర్శన హోమ మహోత్స వంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గండ్రకోట కుమార్,కొత్తపల్లి బాబు రావు,పొడిశెట్టి శేషాచార్యు లు - లక్ష్మి,తోట తిరుపతి- రాధా,తక్కల్లపల్లి నాగేశ్వర రావు - రమ,తొడుపునూరి కిషోర్- సౌజన్య,గంధం మహేందర్ - లత,మార్త లింగమూర్తి - కవిత,పైడి మల్ల రంజిత్ - గ్రీష్మ, పడమటిoటి నగేష్,అక్కిన పల్లి ఓం ప్రకాష్ - అరుణ, ఎల్కతుర్తి విజయ,ఇమ్మడి కావేరి,నన్నేవేన కళ్యాణి తదితరులు కార్యక్రమంలో దంపతులుగా పాల్గొని స్వామి వారి అనుగ్రహా భాగ్యం పొందారు.