Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆపరేషన్ ముస్సాన్-XII విజయవంతం..

    Author VENKATESH | 01 Aug 2026, 04:56 PM | TELANGANA
    ఆపరేషన్ ముస్సాన్-XII విజయవంతం..

    సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్–XII’ విజయవంతంగా ముగిసింది. జులై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు.. మొత్తం 664 మంది చిన్నారులను రక్షించారు. వీరిలో 644 మంది బాలురు, 20 మంది బాలికలు ఉన్నారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా తెలంగాణకు చెందిన 162 మంది చిన్నారులను రెస్క్యూ చేయగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన 502 మంది చిన్నారులను గుర్తించారు.
    ఆపరేషన్‌లో భాగంగా సైబరాబాద్ పోలీసులు ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమలు, కంపెనీలు, దుకాణాలు, హోటళ్లు, నిర్మాణ ప్రదేశాలు తదితర ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న పిల్లలను, ర్యాగ్ పికింగ్‌తో, ఇతర ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను గుర్తించి రక్షించారు. రక్షించిన చిన్నారుల వివరాలను దర్పణ్ యాప్‌లో పోలీసులు నమోదు చేశారు.