Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫోన్‌ హ్యాక్‌ చేసి.. తెలిసినవారికి వాట్సాప్‌ లింక్‌ పంపించి..

    Author VENKATESH | 01 Aug 2026, 01:29 PM | Crime
    ఫోన్‌ హ్యాక్‌ చేసి.. తెలిసినవారికి వాట్సాప్‌ లింక్‌ పంపించి..

    సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ ట్రెండ్‌ను మారుస్తున్నారు. మొబైల్‌ నంబర్లను హ్యాక్‌ చేసి.. ఆ నంబర్‌ నుంచి తెలిసినవారికి, వాట్సాప్‌ గ్రూప్‌లకు లింకులు పంపించి పెట్టుబడులు పెట్టండంటూ పోస్టులు పెడుతున్నారు. తెలిసిన వారి మొబైల్‌ నంబర్‌ నుంచే మెసేజ్‌లు వచ్చాయి కదా అని ఓపెన్‌ చేసి పెట్టుబడి పెడితే డబ్బులు కొట్టేస్తున్నారు.
    ఏపీకే ఫైల్స్‌తో మరో తరహా మోసం
    ప్రభుత్వ పథకాల్లో నమోదు చేసుకోవాలని వాట్సాప్‌ గ్రూప్‌లలో ఏపీకే (ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజ్‌) ఫైల్స్‌ను సైబర్‌ నేరగాళ్లు పంపుతున్నారు. పథకాల్లో నమోదు చేసుకొనేందుకు ఆధార్‌, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా నంబరు, వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయగానే డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల నుంచి షాపింగ్‌ యాప్‌ల ద్వారా డబ్బులు కొట్టేస్తున్నారు.
    మొబైల్‌ ఫోన్‌ హ్యాక్‌ అయిందని కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చు. ఫోన్‌ స్పీడ్‌ ఉన్నట్టుండి తగ్గిపోతుంది. బ్యాటరీ చార్జింగ్‌ వెంటవెంటనే తగ్గిపోతూ ఫోన్‌ వేడెక్కుతుంది. మొబైల్‌లో అనుమానాస్పద ఏపీకే ఫైల్స్‌ కనిపిస్తుంటాయి. తెలియని ఓటీపీలు, మెసేజ్‌లు వస్తుంటాయి. వెబ్‌సైట్లలో సంబంధం లేని బ్రౌజర్లు ఓపెన్‌ అవుతుంటాయి. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మొబైల్‌ఫోన్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారని గుర్తించాలి. ఫోన్‌లో ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ చేయాలి. లేదా వెంటనే ఫోన్‌ను స్విచాఫ్‌ చేయాలి