Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 16వ వార్డులో తోట్ల బోనాలు వైభవంగా నిర్వహణ

    Author VENKATESH | 31 Jul 2026, 08:59 PM | సిద్దిపేట
    16వ వార్డులో తోట్ల బోనాలు వైభవంగా నిర్వహణ

    సిద్ధిపేట పట్టణంలోని 16వ వార్డులో మాజీ కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్ ఆధ్వర్యంలో, తోట్ల మైసమ్మ కమిటీ నిర్వహించిన తోట్ల బోనాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది.
    ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ, పోతురాజుల విన్యాసాలు, సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలతో ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
    మాజీ కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఏడాది ఇదే ఉత్సాహంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
    .ఈ కార్యక్రమంలో తోట్ల మైసమ్మ కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.