Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 2027 వన్డే ప్రపంచ కప్‌.. భువీని జట్టులోకి తీసుకోవాలి

    Author VENKATESH | 31 Jul 2026, 02:38 PM | Sports
    2027 వన్డే ప్రపంచ కప్‌.. భువీని జట్టులోకి తీసుకోవాలి

    వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తోన్న నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్‌లో భారత తుది జట్టు గురించి అంచనా వేశాడు. ఈ క్రమంలో స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. విదేశీ పిచ్‌లపై భువీ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.
    వన్డే ప్రపంచ కప్ 2027లో భువనేశ్వర్ కుమార్‌ను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఫస్ట్‌క్లాస్, విజయ్ హజారే ట్రోఫీ సహా అన్ని టోర్నీల్లో అతడిని ఆడించి దక్షిణాఫ్రికా ప్రపంచ కప్‌కు సిద్ధం చేయాలి. అక్కడ అతడి అనుభవం జట్టుకు ఎంతో అవసరం అవుతుంది’ అని అశ్విన్ పేర్కొన్నాడు. 2022 తర్వాత వన్డేలు ఆడని భువనేశ్వర్.. ఐపీఎల్‌ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో 28 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. దీంతో ప్రపంచకప్‌కు జట్టును సిద్ధం చేసే క్రమంలో అతడిని మరోసారి పరిశీలించాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.