Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రామగుండంఎన్టీపీసీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

    Author VENKATESH | 22 Jul 2026, 11:17 AM | పెద్దపల్లి
    రామగుండంఎన్టీపీసీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

    పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఓ డీసీఎం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు డీసీఎం వ్యాన్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. దీంతో క్యాబిన్‌లో ఇరుక్కుని డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందారు.

    అదే సమయంలో అటుగా వెళ్తున్న వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి వెంటనే స్పందించి, స్థానికుల సహాయంతో క్యాబిన్‌లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు చత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.