Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 'విద్యార్థుల వెంటే ప్రభుత్వం- నీట్​ పేపర్​ లీక్​ దోషులపై కఠిన చర్యలు'- NDA మీటింగ్​లో మోదీ

    Author VENKATESH | 21 Jul 2026, 01:23 PM | NATIONAL
    'విద్యార్థుల వెంటే ప్రభుత్వం- నీట్​ పేపర్​ లీక్​ దోషులపై కఠిన చర్యలు'- NDA మీటింగ్​లో మోదీ

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్​ పేపర్ లీక్​ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా స్పందించారు. ఇది జాతీయ సమస్య అని, దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. దిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో 'మంగళ్ మిలన్' పేరుతో జరిగిన ఎన్​డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. సమావేశం అనంతరం ఎన్​డీఏ నేతలకు, ఎంపీలకు ప్రధాని మోదీ చేసిన కీలక సూచనలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్​ రిజిజు మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో నీట్‌ పరీక్ష పేపర్ లీక్‌, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు), దేశ ఆర్థిక పురోగతి తదితర అంశాలపై మాట్లాడినట్లు తెలిపారు.


    'నీట్​ పేపర్​ లీక్ జాతీయ సమస్య'
    నీట్‌ పరీక్ష పేపర్ లీక్‌ వ్యవహారంపై ప్రధాని మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారని కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల వెంటే నిలుస్తుందని, ప్రశ్నాపత్రాల లీకేజీ దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశమని ప్రధాని పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ సమస్యను రాజకీయ కోణంలో చూడకుండా, జాతీయ సమస్యగా భావించి పరిష్కరించాలని ప్రధాని సూచించారని చెప్పారు. పేపర్ లీక్‌లకు బాధ్యులైన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించినట్లు రిజిజు తెలిపారు. అవసరమైతే న్యాయ నిపుణులతో సంప్రదించి చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధిలో జరిగే పేపర్ లీక్ ఘటనలపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని స్పష్టం చేసినట్లు వెల్లడించారు.

    'మనందరి బాధ్యత అదే'
    పార్లమెంట్‌లో నిర్మాణాత్మక చర్చలు జరిగేలా విపక్షాలు సహకరించాలని ప్రధాని మోదీ తెలిపినట్లు కిరణ్ రిజిజు పేర్కొన్నారు. రాజకీయంగా విభేదాలు ఉండొచ్చని, కానీ దేశ భవిష్యత్తు, యువత సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఎంపీలందరిపై ఉందని ప్రధాని సూచించినట్లు తెలిపారు. పిల్లలను రెచ్చగొట్టొద్దని, తప్పుడు మార్గంలోకి వెళ్లడం సులభమని అన్నారు. కానీ తిరిగి సరైన మార్గంలోకి రావడం చాలా కష్టమని, వారు సరైన మార్గంలో వెళ్లేలా చూసుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నట్లు చెప్పారు. నీట్ పరీక్షలో అక్రమాలపై నివేదికలు అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకుందని, కిరణ్ రిజిజు తెలిపారు. ఈ వ్యవహారంలో 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యతనిస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా రీ-ఎగ్జామ్‌ను విజయవంతంగా నిర్వహించి వెంటనే ఫలితాలను సైతం వెల్లడించామన్నారు.

    ఇవి కూడా చదవండి


    'రైతుల ప్రయోజనాలే ముఖ్యం'
    ఎన్​డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎంతో ఫలవంతంగా జరిగిందని కిరణ్ రిజిజు తెలిపారు. ఇటీవల దేశం సాధించిన విజయాలు, వివిధ దేశాలతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై ప్రధాని, ఎంపీలకు వివరించారని చెప్పారు. వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఎఫ్‌టీఏలపై మాట్లాడిన ప్రధాని, రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చినట్లు రిజిజు వెల్లడించారు. ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నా రైతుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలే తీసుకుంటామని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులను కూడా సమావేశంలో స్వాగతించినట్లు పేర్కొన్నారు.

    నీట్ పరీక్షలో జరిగినట్లు ఆరోపణలు అవకతవకలు, పరీక్ష రద్దు అనంతరం విద్యార్థుల ఆత్మహత్యల అంశాలపై ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉంటున్నారంటూ విపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని సీజేపీ నిరసనలు చేపట్టింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తోంది.