Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వేములవాడ రాజన్నకు భక్తుడి రూ.7 లక్షల విరాళం - 'హెల్త్ కండీషన్​ బాలేదు' ప్లీజ్​ తిరిగిచ్చేయండంటూ కుమార్తెల రిక్వెస్ట్​

    Author VENKATESH | 21 Jul 2026, 01:09 PM | రాజన్న సిరిసిల్ల
    వేములవాడ రాజన్నకు భక్తుడి రూ.7 లక్షల విరాళం - 'హెల్త్ కండీషన్​ బాలేదు' ప్లీజ్​ తిరిగిచ్చేయండంటూ కుమార్తెల రిక్వెస్ట్​

    : ఆ దంపతులు తమ ఏడుగురు కుమార్తెలందరికీ వివాహాలు చేసి, జీవిత చరమాంకానికి చేరుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామికి పరమ భక్తులైన వారు, తమ దగ్గరున్న డబ్బునంతా రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు డొనేషన్​ కింద అందజేశారు. అయితే తమ నాన్నకు మతి స్థిమితం సరిగా లేదంటూ ఆయన కుమార్తెలు తర్వాత ఆలయానికి వచ్చి విరాళం వెనక్కి ఇవ్వాలని అడిగిన ఉదంతమిది.

    వారి అంగీకారం మేరకే తీసుకున్నాం : వేములవాడకు చెందిన వృద్ధ దంపతులు సోమవారం రాజన్న ఆలయానికి రూ.7,01,116ను విరాళంగా సమర్పించారు. ఆలయ పర్యవేక్షకుడు శ్రీనివాస్‌ శర్మ, ప్రొటోకాల్‌ పర్యవేక్షకుడు శ్రీనివాస్‌లు వారికి రసీదును అందజేశారు. అయితే తమ తండ్రికి మతిస్థిమితం సరిగా లేదని, అందుకే ఉన్న డబ్బంతా ఆలయానికి సమర్పించారంటూ వారి కుమార్తెలు ఆలయ అధికారుల దృష్టికి తీసుకుళ్లారు. అమ్మానాన్నల పోషణ కోసం దాన్ని తిరిగివ్వండని దంపతుల కుమార్తెల్లో కొందరు ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే తాము దంపతుల అంగీకారం మేరకే విరాళం కింద ఇచ్చిన నగదు స్వీకరించామని, ఒకసారి స్వామికి సమర్పించాక వెనక్కి ఇచ్చే అవకాశం ఉండదని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేశారు. దాంతో ఏమీ చేయలేక వారు వెనక్కి వెళ్లగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

    వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా ఆలయ అభివృద్ధి : భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్ర తరహాలో అభివృద్ధి చేయాలన్నది అక్కడి ప్రజల చిరకాల కోరిక. ప్రస్తుతం ఆ కల సాకారమయ్యే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఆలయ విస్తరణ సహా క్షేత్ర అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. సుమారు రూ.548 కోట్లతో 3 ఫేజుల్లో వేములవాడ పుణ్యక్షేత్ర అభివృద్ధి పనుల్ని చేపట్టాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దశలో ప్రధాన ఆలయ విస్తరణ పనులను చేపట్టారు. ఈ పనులకు గతేడాది నవంబర్‌ 20న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేసి, రూ.76 కోట్లతో ప్రధానాలయ విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఆ రాజరాజేశ్వరుడు కొలువై ఉన్న మహా మండపాన్ని తాకకుండా చుట్టూ ఆలయాన్ని 4 ఎకరాల మేర విస్తరించే పనులను చేస్తున్నారు.

    ఇవి కూడా చదవండి

    ఎల్​ఈడీ తెరపై దర్శనాన్ని అందిస్తూ : ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతుండటంతో ప్రస్తుతం ప్రధానాలయంలో భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. గుడి ముందు ఉన్న రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన ప్రచార రథం ద్వారా ఎల్​ఈడీ తెరపై స్వామి వారి దర్శనాలను ఆలయ నిర్వాహకులు కొనసాగిస్తున్నారు. భక్తులు చేసే ఆర్జిత సేవలను భీమేశ్వర ఆలయానికి మార్చి నిర్వహిస్తున్నారు. ఇక్కడ రూ.6 కోట్లతో ఆలయం లోపల, బయట షెడ్ నిర్మాణం, స్నానపు గదులు, ప్రసాదం కౌంటర్లు, ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. తాత్కాలిక ఏర్పాట్లకు సంబంధించి భక్తులకు తెలియపరిచేలా సైన్​ బోర్డులను ఏర్పాటు చేశారు.

    అర్చకులు, సిబ్బందికి మాత్రమే అనుమతి : వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం గతంలో ఉన్న నిర్మాణాలను కూల్చి వేసి కొత్త నిర్మాణాలు చేపట్టారు. చెరువు కట్టపై ఉన్న ప్రధానాలయ విస్తరణను పూర్తిగా రాఫ్ట్‌ ఫౌండేషన్‌ విధానంలో చేస్తున్నారు. ఆలయ విస్తరణలో చుట్టూ కత్తగా 64 పిల్లర్లు రానున్నాయి. మహామండపం, నిత్య కళ్యాణ, వ్రత, అద్దాల, కోడెల, భక్తుల విశ్రాంతి మండపాల పనులు వేగంగా జరుగుతున్నా వివిధ దశల్లో ఉన్నాయి. పిల్లర్లు, స్లాబ్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. ప్రతి రోజు స్వామివారికీ కైంకర్యాలు నిర్వహించే అర్చకులు, పారిశుద్ధ్య సిబ్బందిని మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వచ్చే ఏడాది మహా శివరాత్రి మహోత్సవాలకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా యంత్రాంగం అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ముందుకు సాగుతోంది.