Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చెబితే వినరు - తీరు మార్చుకోరు : కొందరి తప్పులతో 'ఖాకీ'లందరికీ తలవంపులు!

    Author VENKATESH | 21 Jul 2026, 12:53 PM | TELANGANA
    చెబితే వినరు - తీరు మార్చుకోరు : కొందరి తప్పులతో 'ఖాకీ'లందరికీ తలవంపులు!

    హైదరాబాద్​లో నెల రోజుల వ్యవధిలో పోలీస్​ శాఖలో జరుగుతోన్న వరుస ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. దీనికంతటికి కొందరు వేసిన తప్పటడుగులు పోలీసు ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. సామాజిక భద్రతలో కీలకమైన రక్షక భటులు అవినీతి పరులతో చేతులు కలపటం, వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ పరువు తీస్తున్నారంటూ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ఆవేదన వెలిబుచ్చారు. పోలీస్​ స్టేషన్​కు ఫిర్యాదు చేసేందుకు వచ్చే మహిళలు, యువతుల పట్ల కొందరు పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

    గతంలో ఓ మహిళా ఎస్సైని వేధించిన ఇన్​స్పెక్టర్​కు మహిళలకు భద్రత కల్పించే విభాగానికి బదిలీ చేయటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరుగుతున్న ఘటనలతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పోలీస్​ స్టేషన్​కు వచ్చే బాధితుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్న సిబ్బంది, వివాహేతర సంబంధాలతో భార్యాపిల్లలను వేధిస్తున్న వారి చిట్టా సిద్ధం చేయనున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అవసరమైన వారికి కౌన్సిలింగ్​ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

    ఇటీవల జరిగిన ఘటనలు :

    ఇవి కూడా చదవండి

    కానిస్టేబుల్​తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఎస్సై భార్య ఫిర్యాదుతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణ నిర్వహించారు. వాస్తవమని గుర్తించి, సబ్​ ఇన్​స్పెక్టర్​ను సస్పెండ్​ చేశారు.
    ఆయన డీఎస్పీ హోదాలో ఉండి రూ.200 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించారు. బినామీలుగా బంధుమిత్రులు ఉన్నారు. ఎంతో కాలంగా సాగుతున్న అక్రమాల గుట్టును అవినితి నిరోధక శాఖ అధికారులు ఇటీవల బట్టబయలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు గుర్తించి డీఎస్పీని అరెస్ట్​ చేశారు.
    ఎన్నో ఏళ్లుగా శ్రమించి సివిల్స్​లో విజేతగా నిలిచాడు. మహిళా ట్రైనీ ఐపీఎస్​తో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
    వీరందరిని దారిలో పెట్టేదెలా? : కొందరు కేసుకో రేటు కట్టి వసూళ్లకు దిగుతున్నారు. ప్రొబెషన్​లో ఉండగానే ఒక మహిళా ఎస్సై లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కారు. మరో ఎస్సై రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. హైదరాబాద్​లోని అధిక శాతం పోలీసులు లంచం, ఫిర్యాదుదారుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, గృహ హింస, మహిళలు, యువతులను లోబరచుకునేందుకు ప్రయత్నించి బదిలీలు, సస్పెన్షన్లకు గురవుతున్నారు. గతంలో వివాహేత సంబంధాలు నెరుపుతున్న ముగ్గురు ఇన్​స్పెక్టర్లను సర్వీసు నుంచి తొలగించారు. వ్యక్తిగత ప్రవర్తనపై సిబ్బందికి కౌన్సిలింగ్​ ఇచ్చినా ఫలితం సాధించలేకపోయామని పోలీసు అధికారి ఒకరు వాపోయారు.

    ఖాకీల అక్రమాలు వెలుగులోకి : గుర్తు తెలియని వ్యక్తుల నుంచి లభించిన మోటార్ ​సైకిళ్లను ఇతరులకు విక్రయిస్తూ ముగ్గురు పోలీస్​ కానిస్టేబుళ్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్​ స్టేషన్​లో పని చేస్తున్న ముగ్గురు సిబ్బంది కొన్నేళ్లుగా ఇదే దందా కొనసాగిస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. ఇటీవల తిప్పర్తిలో ఒక మోటార్​ సైకిల్​ను విక్రయించి అడ్డంగా దొరికినట్లు విశ్వసనీయ సమాచారం.

    హెచ్చరికలతోనే సరి : మరోవైపు పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్​ నుంచి అధికారుల వరకు చాలా మంది వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలు ప్రైవేటు చిట్​ఫండ్​లతో పాటు ఫైనాన్స్​లలో భాగస్వాములవుతున్నారు. మరికొందరు స్థిరాస్తి వ్యాపారాల్లో తెరచాటుగా ఉంటూ దందాలు సాగిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. జూదం ఆడుతూ పట్టుబడుతున్న వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ రచ్చకెక్కుతున్న వారూ లేకపోలేదు. తప్పిదాలు చేస్తున్న సిబ్బందిపై అధికారులు మౌఖికంగా హెచ్చరిస్తున్నారే తప్ప, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.