Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పాక్​ విక్టిమ్ కార్డ్​ వ్యూహం విఫలం- యథావిధిగా సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ సాధ్యం కాదు: భారత్​

    Author VENKATESH | 21 Jul 2026, 12:48 PM | NATIONAL
    పాక్​ విక్టిమ్ కార్డ్​ వ్యూహం విఫలం- యథావిధిగా సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ సాధ్యం కాదు: భారత్​

    సింధు జలాల ఒప్పందం ప్రస్తుత రూపంలో ఇక కొనసాగే అవకాశం లేదని భారత్​ తేల్చిచెప్పింది. పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఇచ్చే మద్దతును నమ్మదగిన విధంగా, శాశ్వతంగా నిలిపివేసే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేసి ఉంచుతామని స్పష్టం చేసింది. ఈ ఒప్పందంపై మళ్లీ ఆలోచించాలన్నా, లేదా పునఃసమీక్షించాలన్నా పాకిస్థాన్​ ఉగ్రవాదాన్ని ఆపడమే ప్రాథమిక షరతు అని, ఆ తర్వాతే చర్చలు సాధ్యమవుతాయని పేర్కొంది.