Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డ్రై ఫ్రూట్స్ అతిగా తింటే ఆరోగ్యానికి హాని జ‌రుగుతుంద‌ట‌..

    Author VENKATESH | 19 Jul 2026, 06:39 PM | HEALTH
    డ్రై ఫ్రూట్స్ అతిగా తింటే ఆరోగ్యానికి హాని జ‌రుగుతుంద‌ట‌..

    డ్రై ఫ్రూట్స్ (Dry froots) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విష‌యం ఈ రోజుల్లో అంద‌రికీ తెలుసు. బాదం (Almonds), జీడిపప్పు, వాల్‌నట్స్ (Wall Nuts), ఖర్జూరం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటిని సరైన విధంగా తీసుకోకపోతే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, శరీరంలో వేడి పెరగడం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య‌ నిపుణులు చెబుతున్నారు.
    డ్రై ఫ్రూట్స్‌ను నేరుగా తినడం కంటే రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తీసుకోవడం మంచిదని ఎక్స్‌ప‌ర్ట్స్‌ చెబుతారు. ఇలా చేయడంవల్ల వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ తగ్గి, పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. రోజుకు సుమారు 20 నుంచి 30 గ్రాముల వరకు మాత్రమే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
    ఎండు ఖర్జూరాలు, వాల్‌నట్స్, నానబెట్టని బాదంపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేడి వాతావరణంలో వీటిని మితంగా తీసుకోవడం, వీలైతే నానబెట్టి తినడం మంచిదని సూచిస్తున్నారు. ఎక్కువగా తీసుకుంటే అజీర్ణం, కడుపు నొప్పి, మొటిమలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
    నానబెట్టిన బాదంపప్పు, ఎండుద్రాక్ష, జీడిపప్పు, ఖర్జూరాలను పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. అలాగే మఖానా (ఫాక్స్ నట్స్) ను తేలికైన, ఆరోగ్యకరమైన చిరుతిండిగా పరిగణిస్తారు. ఇది శరీరానికి చల్లదనాన్ని అందించే గుణాలు కలిగి ఉంటుందని చెబుతారు.