Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • లార్డ్స్ బాల్కనీలో గంభీర్, రోహిత్..

    Author VENKATESH | 18 Jul 2026, 10:12 PM | Sports
    లార్డ్స్ బాల్కనీలో గంభీర్, రోహిత్..

    ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ కోల్పోయిన భారత జట్టు వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. రెండే వన్డేలో గెలిచి సిరీస్ సమం చేసిన ఆతిథ్య జట్టును ఓడించి పరువు కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. ఆదివారం మ్యాచ్ కోసం ఇప్పటికే శుభ్‌మన్ గిల్ సేన లార్డ్స్‌కు చేరుకోగా.. వీడ్కోలు వార్తలు వస్తున్న వేళ కోచింగ్ సిబ్బందితో రోహిత్ శర్మ(Rohit Sharma) సరదాగా కనిపించాడు. లార్డ్స్ బాల్కనీలో నవ్వుతూ.. గత విజయాలను గుర్తు చేసుకున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.
    ఫామ్ లేమితో బాధపడుతున్న రోహిత్ శర్మ కెరీర్ లార్డ్స్ వన్డేతో ముగియనుంది అనే ప్రచారానికి తెరపడినట్టే అనిపిస్తోంది. సోషల్ మీడియాలో, మాజీ ఆటగాళ్ల నుంచి రోహిత్‌కు మద్దతు లభించడం.. అనుభవజ్ఞుడైన అతడి సేవలు అవసరమేగా? అనుకున్నారో ఏమో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతే రోహిత్‌కు ఇది ఆఖరి మ్యాచ్ కాదని చెప్పాడు. సైకియా ప్రకటనతో హిట్‌మ్యాన్ వీడ్కోలు వాయిదా పడిందనే నమ్మకం అభిమానుల్లో బలపడింది. వచ్చే వన్డే ప్రపంచకప్‌ 2027 సన్నాహాల్లో రోహిత్ భాగమేనని అనుకుంటున్నారంతా.