Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వెంటనే కేంద్ర బిజెపి ప్రభుత్వం సోనం వాంగ్చుక్ నిరాహాదీక్ష పై స్పందించాలి

    Author VENKATESH | 17 Jul 2026, 09:31 PM | నారాయణపేట
    వెంటనే కేంద్ర బిజెపి ప్రభుత్వం సోనం వాంగ్చుక్ నిరాహాదీక్ష పై స్పందించాలి

    తక్షణమే విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేసి, సైంటిస్ట్ సోనమ్ వాంగ్ చుక్ ప్రాణాలు కాపాడాలి
    -- నిరాహార దీక్ష చేపట్టి 19రోజులు గడుస్తున్న స్పందించని బిజెపి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం
    -- డా.బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ నియోజకవర్గం
    నారాయణపేట, జూలై 17 (బి వి కే న్యూస్)
    కేంద్ర బిజెపి ప్రభుత్వం వెంటనే సోనం వాంగ్చుక్ నిరాహాదీక్ష పై స్పందించాలనీ,
    తక్షణమే విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేసి, సైంటిస్ట్ సోనమ్ వాంగ్ చుక్ ప్రాణాలు కాపాడాలనీ,నిరాహార దీక్ష చేపట్టి 19రోజులు గడుస్తున్న స్పందించని బిజెపి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని స్థానికంగా ఐ.బి దగ్గర ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ నాయకులు మాట్లాడుతూ అన్నారు.
    గత 20 రోజుల క్రితం కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల నీట్ వంటి జాతీయ పరీక్షలు వరుసగా లీకులవుతుండటంతో విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ చేపట్టిన ధర్నాలో పాల్గొన్న సైంటిస్ట్,సామాజికవేత్త సోనం వాంగ్చుక్ విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నిరాహార దీక్ష చేపట్టి నేటికి 20వ రోజు అవుతున్నపట్టికీ కేంద్రంలోని ప్రధాని మోడీ బిజెపి ప్రభుత్వం కనీస స్పందన లేకుండా దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తుండటం సిగ్గుచేటనీ తక్షణమే బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించాలన్నారు.
    అదేవిధంగా సోనం వాంగ్ చుక్ సైంటిస్ట్ గా,పర్యావరణవేత్తగా సామాజికవేత్తగా తాను పుట్టిన గడ్డ అయినా లడక్ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేలా కరిగిపోయే కృత్రిమ మంచు పర్వతాలను సృష్టించడం,లడక్ ప్రజల అటవీ మరియు సహజ వనరుల హక్కుల కోసం పోరాడుతూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రామన్ మెగసెస్ వంటి అవార్డులతో దేశానికి గొప్ప పేరును తీసుకొచ్చాడన్నారు.అటువంటి గొప్ప వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవాలని దేశ వ్యాప్తంగా ప్రజలు సోషల్ మీడియా,ఇతర మార్గాల ద్వారా మద్దతు తెలుపుతూ ఎడ్యుకేషనల్ మినిస్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ బీజేపీ మోడీ ప్రభుత్వం కళ్ళుండి చూడలేని గుడ్డి వారిలా నడుచుకోవాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.కావున వెంటనే విద్యార్థుల బలవన్ మరణానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్రతో రాజీనామా చేయించి సోనమ్ వాంగ్ చుక్ ప్రాణాలను కాపాడాలన్నారు.లేని యెడల ఢిల్లీలో మొదలైన ఈ ఉద్యమాన్ని గల్లి గల్లికి విస్తరించేలా ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు.
    కార్యక్రమంలో డా.బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పృథ్వీరాజ్, అంబేద్కర్ యువజన సంఘం కీలక సభ్యులు తల్వార్ నరేష్, సందీప్, నాగేష్ గోలపల్లి తదితరులు పాల్గొన్నారు.