Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పత్రికా ప్రకటన, తేది:17-07-2026, నారాయణ పేట జిల్లా,

    Author VENKATESH | 17 Jul 2026, 09:24 PM | Array
    పత్రికా ప్రకటన, తేది:17-07-2026, నారాయణ పేట జిల్లా,

    మూడ్ మల్ మెగాలిథిక్ మెన్హిర్ సైట్ అభివృద్ధికి చర్యలు
    ----- జిల్లా కలెక్టర్ తో దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ భేటీ.
    నారాయణ పేట జిల్లా కృష్ణా మండలంలోని
    మూడ్ మల్ బృహత్ శిలా ఫలకాల (మెగాలిథిక్ మెన్హిర్) ప్రదేశానికి సంబంధించిన సర్వే నంబర్ల పరిధిలో ఉన్న మొత్తం ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక తహసీల్దార్‌ను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్, హెరిటేజ్ తెలంగాణ కార్యాలయ విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ నాగ లక్ష్మీ బృందం కలెక్టర్ ప్రియాంకతో భేటీ అయ్యారు.
    ఈ సందర్బంగా దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్
    ముడుమల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణం అని,
    యూనెస్కో శాశ్వత గుర్తింపు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందనీ,
    నిలువురాళ్ల ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ కు వివరించారు. ఇది వరకు ఇక్కడ ఉన్న కలెక్టర్లు నిలువు రాళ్ళ పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు చేపట్టారని తెలిపారు. నిలువు రాళ్ళ ప్రదేశం గుండా వెళ్తున్న విద్యుత్ గ్రిడ్ లైన్‌ను తరలించే అంశంపై వారు కలెక్టర్ తో చర్చించారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డిప్యూటీ కలెక్టర్ ఫణి కుమార్, విద్యుత్ శాఖ ఎస్ ఈ నవీన్, డీ ఈ ఓ గోవింద రాజులు, ఆర్ అండ్ బీ ఈ ఈ వెంకట రమణ, సర్వే ల్యాండ్ ఏ డీ వేణు గోపాల్, పీ ఆర్ ఈ ఈ అశోక్, డీ పీ ఆర్ వో రషీద్, హెరిటేజ్ విభాగ ఏ ఈ నరేష్, మూడ్ మల్ సర్పంచి బాల్ రాజ్ పాల్గొన్నారు.
    --------------------------------------------- జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి నారాయణపేట చే జారీ చేయనైనది.