Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నీరజ్ అడ్వకేట్ పై దాడి అమానుషం

    Author VENKATESH | 17 Jul 2026, 08:47 PM | నారాయణపేట
    నీరజ్ అడ్వకేట్ పై దాడి అమానుషం

    - దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్
    - విధులు బహిష్కరించిన మక్తల్ న్యాయవాదులు
    నారాయణపేట, జూలై 17 (బి వి కే న్యూస్)
    నర్వ మండలం ఉందెకొడ్ గ్రామానికి చెందిన నీరజ్ అడ్వకేట్ పై దాడి అమానుషమని, నీరజ్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని శుక్రవారం మక్తల్ న్యాయ వాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
    దాడి సంఘటనకు నిరసన వ్యక్తం చేస్తూ జూనియర్ సివిల్ జడ్జికి విధులకు హాజరు కావడం లేదని వినతి పత్రం అందజేసి కోర్టు బయట న్యాయవాదులు అందరూ తమ న్యాయవాదికి న్యాయం జరగాలని, పోలీసులు తక్షణం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
    కార్యక్రమం లో అడ్వకేట్ లు దత్తాత్రేయ, తిమ్మన్న, శ్రీనివాస్ లు, సూర్య ప్రకాష్, రంకుల ఆనంద్, రవి కుమార్ గౌడ్, శివ కుమార్, సురేందర్, పొర్ల ఆనంద్, బండారి శ్రీనివాస్, దినేష్ వర్మ, భరత్ కుమార్, వెంకటేష్ గౌడ్, సునీత, సతీశ్ కుమారి తదితరులు పాల్గొన్నారు