Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆగస్ట్ 15 నుండి కొత్త పెన్షన్ లు..

    Author VENKATESH | 17 Jul 2026, 01:25 PM | TELANGANA
    ఆగస్ట్ 15 నుండి కొత్త పెన్షన్ లు..

    ప్రతినెల పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూసే పేదలు ఎంతోమంది ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, డయాలిసిస్ బాధితులు దాదాపు 42 లక్షల మంది చేయూత పింఛన్ల పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు లక్షల పింఛన్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్తగా లక్ష పింఛన్లు మంజూరు చేసినట్టు, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు లక్షల పింఛన్లు ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గతంలోనే వెల్లడించారు. కొత్తగా ఇవ్వబోయే పింఛన్ల కోసం బడ్జెట్లో నిధులను కేటాయించినట్లుగా సీతక్క చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు తాజాగా కొత్త పించన్ లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మరో శుభవార్త చెప్పారు మంత్రి సీతక్క. ఆగస్టు 15వ తేదీ నుంచి ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్టు గా మంత్రి సీతక్క ప్రకటించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.