Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అంతరిక్షంలోకి ప్రధాని మోదీ రాసిన పోస్ట్‌కార్డు..

    Author VENKATESH | 17 Jul 2026, 01:08 PM | NATIONAL
    అంతరిక్షంలోకి ప్రధాని మోదీ రాసిన పోస్ట్‌కార్డు..

    స్కైరూట్ సంస్థ రేపు (శనివారం) 'మిషన్ ఆగమన్' పేరిట 'విక్రమ్-1' రాకెట్‌ను శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి పంపనుంది. ఈ రాకెట్‌ సాంకేతిక పరికరాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తన చేతులతో రాసిన ఓ పోస్ట్‌కార్డును కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ప్రధాని మోదీ ఆ పోస్ట్‌కార్డుపై ‘వందేమాతరం’ అని రాశారు. ఈ రాకెట్‌లో ప్రధాని మోదీ రాసిన పోస్ట్‌కార్డు మాత్రమే కాకుండా.. ఇస్రోకు చెందిన ప్రస్తుత, మాజీ చైర్మన్లు.. భారతీయ వ్యోమగాములు, స్కైరూట్ బృందం, ఇన్వెస్టర్లు, విధాన రూపకర్తలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు రాసిన వందలాది చేతిరాత పోస్ట్‌కార్డులు కూడా అంతరిక్షంలోకి వెళ్లనున్నాయి.