Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీటు వచ్చినా.. వదులుకున్నారు..

    Author VENKATESH | 17 Jul 2026, 12:30 PM | ఎడ్యుకేషన్
     సీటు వచ్చినా.. వదులుకున్నారు..

    హైదరాబాద్‌, జూలై 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొందరు ఎప్‌సెట్‌ ర్యాంకర్లు కన్వీనర్‌ కోటాలో సీటు వచ్చినా చేజార్చుకున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 19,325 మంది సీట్లు వదిలేసుకున్నారు. ఎప్‌సెట్‌ మొదటి విడత వెబ్‌ కౌన్సెలింగ్‌లో మొత్తం 79,891 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. రిపోర్టింగ్‌ గడువు ఈ నెల 14న ముగిసింది. గడువులోపు 60,566 విద్యార్థులు మాత్రమే రిపోర్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే నేటి నుంచి రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానున్నది.
    శుక్రవారం ప్రాసెసింగ్‌ ఫీజు, స్లాట్‌ బుకింగ్‌కు అవకాశమిచ్చారు. శనివారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. ఈ నెల 18, 19 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. మొదటి విడతలో 8,162 సీట్లు మిగిలాయి. రిపోర్టింగ్‌ చేయని సీట్లు 19,325 కలిపి మొత్తం 27,487 సీట్లను రెండో విడతలో భర్తీ చేయనున్నారు.