Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్నేహితుల సర్‌ప్రైజ్‌తో సమంత సీమంతం..

    Author VENKATESH | 17 Jul 2026, 12:17 PM | Array
     స్నేహితుల సర్‌ప్రైజ్‌తో సమంత సీమంతం..

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో హ్యాపీ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల సమంత తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఓ సన్నిహిత కుటుంబ వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి వేడుకకు వెళ్లిన ఈ జంటకు అక్కడ స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. సమంత గర్భిణిగా ఉండటంతో ఎలాంటి హడావిడి లేకుండా అక్కడే చిన్నపాటి సీమంతం వేడుక నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో సమంతకు కొత్త దుస్తులు అందించి, స్వీట్లు తినిపించి ఆశీర్వదించారు. ఈ సర్‌ప్రైజ్‌ను అస్సలు ఊహించని సమంత ఒక్కసారిగా ఎమోషనల్ అయి స్నేహితుల ప్రేమాభిమానాలకు ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజ్ నిడిమోరు కూడా ఈ ప్రత్యేక క్షణాలను ఎంతో ఆస్వాదించినట్లు సమాచారం.
    ఈ వేడుకలో సమంత, రాజ్ నిడిమోరు ఒకే రంగు మెరూన్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సమంత, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గడిపిన ఆప్యాయ క్షణాలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు బయటకు రావడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సమంత జీవితంలో ఇది మరపురాని జ్ఞాపకంగా నిలిచిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజులుగా సమంత గర్భధారణపై వార్తలు వినిపిస్తుండగా, ఇటీవల జరిగిన ‘మా ఇంటి బంగారం’ విజయోత్సవ కార్యక్రమంలో ఆమె బేబీ బంప్‌తో కనిపించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆమె షూటింగ్‌లకు విరామం ఇచ్చి కుటుంబంతో కలిసి ఈ ప్రత్యేక సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది.