Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, తాగునీటి సమస్యల నివారణ,

    Author VENKATESH | 16 Jul 2026, 09:24 PM | నారాయణపేట
    ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, తాగునీటి సమస్యల నివారణ,

    - ప్రజాపాలన అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి
    - జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్
    నారాయణపేట, జులై 16 ( బి వి కే న్యూస్ )
    రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా, ప్రజారోగ్యం, సీజనల్ వ్యాధుల నివారణ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థుల నమోదు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలు, రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలపై అవగాహన, ప్రజాపాలన కార్యక్రమాల అమలు తదితర అంశాలపై హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమగ్రంగా సమీక్షించారు.
    ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ....., రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీరు, ప్రజా సేవల రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాల యంత్రాంగం ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
    ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక పాల్గొని జిల్లాలో వివిధ శాఖల్లో చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.
    ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ఇప్పటికే మండల విద్యాధికారులు (ఎంఈఓలు), ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల నమోదు కోసం గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో జిల్లాలో నమోదు శాతం గణనీయంగా పెరుగుతోందని చెప్పారు.
    నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వాటిని నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. తెలంగాణ మోడల్ స్కూల్‌ల ఎంపిక, అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
    భారత వాతావరణ శాఖ హెచ్చరికలు, సూచనలను ఎప్పటికప్పుడు రైతులకు చేరవేస్తున్నామని, రైతు వేదికల ద్వారా సేంద్రియ వ్యవసాయం, ఉద్యాన పంటలు, ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మార్కెట్ అవకాశాలు ఉన్న పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.
    సీజనల్ వ్యాధుల నివారణకు వైద్యారోగ్య శాఖ అధికారులను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, పారిశుధ్య చర్యలు చేపడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వివరించారు.
    ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జిల్లా ప్రత్యేక అధికారి ప్రతి నెల జిల్లాను సందర్శించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలిస్తున్నారని, అందుకు అనుగుణంగా జిల్లాలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.
    జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
    ఈ వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, జెడ్పీ సీ ఈ వో శ్రీనివాస్ రావు, డీఆర్డీవో వెంకట్ రాములు, డీ ఈ ఓ గోవింద రాజులు, హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, డీ ఏ వో సక్రియ నాయక్, డీ ఎం అండ్ హెచ్ ఓ జయ చంద్రమోహన్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంపత్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్ ఈ నవీన్, మిషన్ భగీరథ ఈ ఈ రంగా రావు, ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, సీ పి వో ఖాగా వాహన్, డీ సీ హెచ్ వో మల్లికార్జున్ పాల్గొన్నారు.