Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాయల చంద్రశేఖర్ ఆశయాలను కొనసాగిద్దాం - ఎం.హన్మేష్

    Author VENKATESH | 16 Jul 2026, 04:36 PM | నారాయణపేట
    రాయల చంద్రశేఖర్ ఆశయాలను కొనసాగిద్దాం -  ఎం.హన్మేష్

    సిపిఐ(ఎంఎల్ )మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
    నారాయణపేట, జూలై 16 (బి వి కే న్యూస్)
    ఎలాంటి అంతరాలు లేని సమ సమాజం రావాలని తన జీవితాంతం కృషిచేసిన సిపిఐ(ఎమ్ ఎల్)మాస్ లైన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని సిపిఐ(ఎంఎల్ )మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అన్మేష్ పిలుపునిచ్చారు. గురువారం కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ రెండో వర్ధంతి సందర్భంగా స్థానిక భగత్ సింగ్ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాల తో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అన్మేష్ మాట్లాడుతూ రాయల చంద్రశేఖర్ తెలంగాణ రైతాంగ సాయూద పోరాటం తో స్ఫూర్తి పొంది, మనదేశంలో రైతాంగం భూస్వాముల చేత, కార్మిక వర్గం పెట్టుబడిదారుల చేత అనునిత్యం దోపిడీకి గురి అవుతున్నదని ఈ అన్యాయాలకు, అక్రమాలకు శ్రమ దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలని తన చిన్న వయసులోనే నిర్ణయించుకున్నాడు. తన చదువును కూడా మధ్యలో వదిలేసి ఉద్యమం బాట పట్టాడు. ఈ క్రమంలో రాజ్యం చేత అనేక నిర్భందాలు, ప్రయివేటు గుండాల చేత బెదిరింపులు ఎదుర్కొన్నాడు అయినా ఎక్కడ చలించకుండా పేదల కోసం, కార్మిక వర్గం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. పార్టీని ముందుకు తీసుకెళ్లడం లో తన వంతు కృషి చేశాడు. అటువంటి వ్యక్తిని మనమందరం స్ఫూర్తి గా తీసుకోని సమసమాజ స్థాపనలో భాగస్వామ్యం కావాలని అన్నారు.
    ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు సలీం, కె. కాశినాథ్, బోయిన్ పల్లి రాము, ఎస్. కిరణ్ బి.యాదగిరి, పి.రామకృష్ణ, బి. నర్సింహా, భగవంతు, కొండ నర్సిములు, ఛన్నారెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.