Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎన్యూమరేషన్ పత్రాల పూరించే ప్రక్రియకు సహకరించాలి

    Author VENKATESH | 15 Jul 2026, 04:29 PM | నారాయణపేట
    ఎన్యూమరేషన్ పత్రాల పూరించే ప్రక్రియకు సహకరించాలి

    - జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను
    - అదనపు కలెక్టర్ ను, తాసిల్దార్ ను సన్మానించిన మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస హనుమంతు
    నారాయణపేట, జూలై 15 (బివికె న్యూస్)
    ఎన్యూమరేషన్ పత్రాలను పూరించేలా ఓటర్లకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు సహకరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని 14 వ వార్డులో సర్ హెల్ప్ లైన్ నూతన బూతును జిల్లా ఆదరణ కలెక్టర్ మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతుతో కలిసి ప్రారంభంచారు.
    ఇట్టి కార్యక్రమంలో అదరపు కలెక్టర్ మాట్లాడుతూ..
    ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలు పూరించి తొందరగా బీ ఎల్ వోలకు ఇస్తే డిజిటలైజేషన్ చేస్తారనీ, ఈ నెల 24 వరకు ఎన్యూమరేషన్ పత్రాల పూరించి ఇచ్చేలా ఓటర్లకు తెలియజేయాలని ఆయన సూచించారు. 14 వ వార్డులో హెల్ప్ డెస్క్ పెట్టడం అభినందనీయమని అదనపు కలెక్టర్ అన్నారు.
    పత్రాలు పూరించే ప్రక్రియను వేగవంతం చేస్తూ బూత్ స్థాయి ఏజెంట్లు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకునేలా పార్టీల ప్రతినిధులు శ్రద్ధ వహించాలని కోరారు.
    ఇట్టి కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి, గోవిందరావు, కల్లూరు గోవర్ధన్ వాదిరాజు బి ఎల్ వో లు తదితరులు పాల్గొన్నారు.