Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ 17వ వార్డు ఓటర్లకు అత్యవసర విజ్ఞప్తి - ఎస్ఐఆర్ ఫారమ్‌ల సమర్పణకు రేపే ఆఖరు తేదీ.

    Author VENKATESH | 14 Jul 2026, 09:38 PM | నల్గొండ
    దేవరకొండ 17వ వార్డు ఓటర్లకు అత్యవసర విజ్ఞప్తి - ఎస్ఐఆర్ ఫారమ్‌ల సమర్పణకు రేపే ఆఖరు తేదీ.

    దేవరకొండ 14జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ పట్టణం 17వ వార్డు పరిధిలో నిరంతర ఓటర్ల నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం నాడు బిఎల్ఓ చంద్రమౌళి గారితో కలిసి వార్డులో ఇంటింటికీ తిరిగి ఓటర్ల నుండి ఎస్ఐఆర్ ఫారమ్‌లను సేకరించడం జరిగింది.
    ​ఈ ప్రక్రియలో ఇప్పటివరకు చాలామంది ఓటర్లు ఎంతో బాధ్యతాయుతంగా పాల్గొని వివరాలను అందజేశారు. అయితే, ఇంకా ఎవరైనా ఫారమ్‌లను పూర్తి చేయని వారు ఉన్నట్లయితే, దయచేసి రేపటిలోపు (జులై 15) వాటిని నింపి సంబంధిత అధికారులకు అందజేయవలసిందిగా కోరుతున్నాము.
    ​ఫారమ్‌లను సమర్పించాల్సిన వారు:
    ​ బిఎల్ఓ : చంద్రమౌళి
    ​ బిఎల్ఏ : కరుణాకర్ వై.ఎస్.
    ​ఈ సందర్భంగా వార్డు ప్రతినిధులు మాట్లాడుతూ, "ఓటు హక్కు అనేది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. ఒక్కసారి ఓటు హక్కును కోల్పోతే, దాన్ని మళ్ళీ తిరిగి పొందే ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది. కావున, ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపడుతున్నాము. నిర్లక్ష్యం చేయకుండా రేపటిలోపు అందరూ తమ ఫారమ్‌లను పూర్తి చేసి అందించాలి," అని విజ్ఞప్తి చేశారు.ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ బాధ్యతాయుతమైన పనిలో సహకరించాలని కోరుతున్నాము.