Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏపీ సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు..

    Author VENKATESH | 13 Jul 2026, 12:12 PM | ANDHRA PRADESH
    ఏపీ సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు..

    ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) ఎంచుకునేందుకు ఉద్యోగులకు ఒకేసారి అవకాశం(One-time option) ఇస్తూ ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నెం.53ను(G.O.MS.No. 53) విడుదల చేసింది. 2004 సెప్టెంబర్ 1కు ముందు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చి, ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారు అర్హులుగా ఉండనున్నారు. ఈ ఉద్యోగులు సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
    ఈ ఉత్తర్వుల ప్రకారం, జీవో జారీ అయిన తేదీ నుంచి మూడు నెలల లోపు అర్హులైన ఉద్యోగులు తమ ఆప్షన్‌ను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఒకసారి ఓపీఎస్ లేదా సీపీఎస్‌కు సంబంధించి ఉద్యోగి ఎంచుకున్న ఆప్షన్‌ను మార్చుకునే అవకాశం ఉండదని (Irrevocable) ప్రభుత్వం పేర్కొంది.