Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్వర లయల విరామం

    Author VENKATESH | 13 Jul 2026, 11:04 AM | కరీంనగర్
    స్వర లయల విరామం

    అమర గాన ప్రయాణం
    (ప్రసిద్ధ గాయకి జానకి మృతికి
    నివాళి అర్పిస్తూ రాసిన కవిత)
    పాటల తోటలో కోకిల వాలింది
    మధుర గానంతో మనుషులను
    గెలిచింది ఈరోజు ఆ కోకిల
    దూరంగా వెళ్ళింది సంగీత
    లోకంలో చీకటి నిండింది
    "ఝుమ్మంది నాదం "అంటూ
    సాగిన నీస్వర ప్రవాహం
    నేడు ముగిసిందా సంగీత
    సామ్రాజ్య అధ్యాయం
    "మౌనమే నీ భాష" అని
    నువ్వు వెళ్ళిపోయినా
    నీ పాటల తోటలో వసంతం
    ఎప్పటికీ వాడిపోదు
    స్వర కెమిస్ట్రీలో జానకమ్మ
    అందెవేసిన చేయి
    దైవ దత్త ప్రతిభతో సంగీత
    సామ్రాజ్యాన్ని శాసించావు
    గోరువంక వాలిందిగో" అని
    నువ్వు పలికిన వేళ
    తెలుగు గుండెల్లో కురిసింది
    అమృతాల మాల
    సువ్వి సువ్వమ్మ అంటూ లాలించి
    నీ గొంతు ప్రతి అమ్మ లాలిపాటకు
    అందించిందో కొత్త వంతు అమ్మ
    లాలి పాటలో నీ ప్రేమను చూశాం
    ప్రేమగీతాల్లో నీ స్వరం విన్నాం
    గజ దొంగ చిత్రంలో నీ ఇళ్ళు
    బంగారం కాను జగదేకవీరుడు
    అతిలోక సుందరిలో అబ్బ
    నీతీయని దెబ్బ లాంటి శృంగార
    హాస్య భావాలను కేవలం
    గొంతులో పలికించావు
    ఏం ఎల్ ఏ (1957) తొలి
    చిత్రంలో నీ ఆశ అడియాస
    చేయిజారే మణిపూస విషాద
    గీతంతో పాటల ప్రస్థానం
    మొదలుపెట్టావు
    వెన్నెల్లో గోదారి అందం
    (సితార1984) పాటకు
    జాతీయ స్థాయిలో ఉత్తమ
    నేపథ్య గాయనీ అవార్డ్
    అందుకున్నావు
    నీ లీల పాడేద వేలా( మురిపించే
    మువ్వలు) పాట ద్వారా
    శాస్త్రీయ సంగీత నైపుణ్యాన్ని
    నిరూపించావు మౌనమే
    ప్రియముగా (మౌనపోరటం)
    ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం
    వహించి సంగీత ప్రపంచంలో
    సరికొత్త సృజనకు మార్గదర్శివైనావు
    50 వేలకు పైగా తెలుగు కన్నడ
    తమిళ్ మలయాళం(చిత్రాల్లో)
    భాషల్లో మెలోడీ క్లాసికల్
    జానపద గీతాలుఆలపించారు
    "సిరిమల్లె పువ్వా" అంటూ
    విరహాన్ని పలికించావు
    "ఆకాశంలో ఆశల హరివిల్లు"
    ఎన్నో విరియించావు
    "నీలి మేఘాలలో గాలి
    కెరటాలలో" తేలిపోయావా
    సంగీత లోకాన్ని తీరని శోకంలో
    ముంచేసి వెళ్ళావా
    "తెలి మంచు కరిగింది" కానీ
    నీ జ్ఞాపకం కరగదు
    కాలం ఎంత మారినా
    నీగాన మధురిమ వీడదు
    భౌతికంగా నువ్వు
    మా నుండి దూరమైన
    నీ ప్రతి పాటలో నువు
    బతికే ఉన్నావు నీ గొంతు
    ఆగినా సంగీత లోకంలో
    నీ గానం చిరస్మరణీయం
    నీవు భౌతికంగా దూరమైన
    కోట్లాది స్వరాలై వెలుగుతావు
    అమర గాయని ఎస్ జానకి
    దివ్య స్మృతికి అక్షర నివాళులు
    జానకి సంగీత ఆశయాలు
    సాధించడానికి కృషి చేయడమే
    మనం చెల్లించే నిజమై నివాళి
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
    కాలమిస్ట్ రచయిత
    కరీంనగర్
    9440245771