Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బీఎంఎస్ నిరంతర పోరాటం తాడిచెర్ల బొగ్గు బ్లాక్ 2

    Author VENKATESH | 11 Jul 2026, 08:53 PM | మంచిర్యాల
    బీఎంఎస్ నిరంతర పోరాటం  తాడిచెర్ల బొగ్గు బ్లాక్ 2

    దృవ న్యూస్ బెల్లంపల్లి ఆర్సి
    మంచిర్యాల జిల్లా మందమర్రి
    బీఎంఎస్ నిరంతర పోరాటం
    ఫలితంగా తాడిచెర్ల బొగ్గు బ్లాక్–II సింగరేణికి కేటాయింపు సింగరేణి కోల్ మెన్స్ కార్మిక సంఘ (బి ఎం ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి వెల్లడి.
    ఈ సందర్భంగా ఈరోజు ఉదయం మందమర్రి ఏరియా కేకే ఓసీపీలో కార్మికులకు స్వీట్స్ పంపిణీ మరియు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ
    కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మరియు బి ఎం ఎస్ కోల్ సెక్టార్ ఇంచార్జ్ కొత్త కాపు లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
    భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలోని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ చేపట్టిన నిరంతర ఉద్యమాలు, పలుమార్లు వినతిపత్రాలు, ఢిల్లీలో కేంద్ర మంత్రులు మరియు బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులతో జరిగిన చర్చలు ఫలితంగా తాడిచెర్ల బొగ్గు బ్లాక్–IIను సింగరేణికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని వడ్డేపల్లి పేర్కొన్నారు.
    సింగరేణి భవిష్యత్తు, కార్మికుల ఉద్యోగ భద్రత, సంస్థ అభివృద్ధి కోసం బీఎంఎస్ నిరంతరం పోరాడుతుంది అని అన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, యాజమాన్యానికి, ప్రజాప్రతినిధులకు పలు మార్లు వినతిపత్రాలు సమర్పించి, సింగరేణికి కొత్త బొగ్గు గనులను కేటాయించాలని బలంగా డిమాండ్ చేసినట్లు తెలిపారు.
    తాడిచెర్ల బొగ్గు బ్లాక్–IIలో సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఈ గనిని సింగరేణికి కేటాయించడం వల్ల సుమారుగా 1200 నుండి 1400 మంది పర్మినెంట్ కార్మికులు అలాగే వేలాది పరోక్ష ఉద్యోగ అవకాశాలు ఏర్పడటంతో పాటు సంస్థకు దీర్ఘకాలికంగా బొగ్గు ఉత్పత్తి కొనసాగించే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఈగని సుమారుగా యాట ఆరు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మరియు సుమారుగా 60 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కంపెనీ పరంగా ట్యాక్స్ ల రూపంలో సుమారు 1500 కోట్ల రూపాయలు ఆర్జిస్తాయని, రాబోయే తరాలకు కూడా సింగరేణి బలోపేతానికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
    అదేవిధంగా, 30-06-2026తో 11వ జేబీసీసీఐ వేజ్ బోర్డు కాలపరిమితి ముగిసినందున, 01-07-2026 నుండి అమలులోకి రావాల్సిన 12వ వేజ్ బోర్డు కమిటీని ప్రభుత్వం మరియు కోల్ ఇండియా యాజమాన్యం వెంటనే ఏర్పాటు చేయాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. వేతన ఒప్పందం ఆలస్యం కావడం వల్ల కార్మికులకు నష్టం జరుగుతుందని అన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, కార్మికుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆలస్యం చేయకుండా చర్చలు ప్రారంభించి న్యాయమైన వేతన ఒప్పందం కుదుర్చాలని కోరారు.
    ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరాజ్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్, కార్యదర్శి చెట్టి వీరన్న, కేంద్ర కోశాధికారి సాయి వేన సతీష్, పిట్ కార్యదర్శి మంద రజినీ కాంత్ నాయకులు డోనికెన రమేష్ ,మేడ రామ్మూర్తి, దీక్షితులు తదితరులు మరియు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘం చేపట్టిన కార్యక్రమానికి మద్దతు తెలిపారు.