Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మక్తల్ నియోజకవర్గానికి 320 కోట్లతో...హ్యామ్ రోడ్లు ...

    Author VENKATESH | 11 Jul 2026, 08:30 PM | Array
    మక్తల్ నియోజకవర్గానికి 320 కోట్లతో...హ్యామ్ రోడ్లు ...

    - సోమవారం పైలాన్ ఆవిష్కరించి పనులు ప్రారంభించనున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ...
    - ఒక్క మక్తల్- నారాయణపేట ఫోర్ లైన్ రోడ్డు కే 237 కోట్లు ..
    - సోమవారం ఉదయం బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపు ..
    నారాయణపేట, జూలై 11(బివికె న్యూస్)
    మఖ్తల్ నియోజకవర్గానికి మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో ఏకంగా 320 కోట్ల రూపాయల నిధులు హ్యమ్ రోడ్ల కింద మంజూరు అయ్యాయని, ఈనెల 13వ తేదీ సోమవారం ఉదయం 9.30 గంటలకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి గార్లు పైలాన్ ఆవిష్కరించి పనులు ప్రారంభిస్తారని కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు కట్టా సురేష్ గుప్తా, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కూరి రవికుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాగనూరు మండల అధ్యక్షుడు శివరాం రెడ్డి, వాకిటి హనుమంతులు తెలిపారు.
    మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ...
    మఖ్తల్ నియోజకవర్గానికి ఏకంగా రూ.320 కోట్లను హ్యమ్ రోడ్ల కింద మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకుని మంజూరు చేయించుకుని వచ్చారని అన్నారు.
    మఖ్తల్ - నారాయణపేట ఫోర్ లైన్ రోడ్డు కు రూ.237.71 కోట్లు,
    మరికల్ - మినాస్ పూర్ - లింగంపల్లి రోడ్డుకు రూ.49.57 కోట్లు,
    ఆత్మకూరు - మరికల్ రోడ్డుకు రూ. 22.47 కోట్లు,
    మాగనూరు మండలం నల్లగట్టు - హిందూపూర్ రోడ్డుకు రూ.10.49 కోట్లు మంజూరు చేయించారని వివరించారు. 13 వ తేది సోమవారం ఉదయం 9.30 గంటలకు మఖ్తల్ పట్టణంలోని గురుకుల సమీపంలో నారాయణపేట రోడ్డుకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు మరియు వాకిటి శ్రీహరి గార్లు
    పైలాన్ ఆవిష్కరించి, పనులు ప్రారంభిస్తారని తెలిపారు.
    అనంతరం బహిరంగ సభ ఉంటుందని, నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
    ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.....
    నారాయణపేట రోడ్డు దశాబ్దాల తరబడి అధ్వాన్నంగా తయారైందని, గత ప్రభుత్వంలో ప్రజలు ఎంత మొత్తుకున్నా పాలకులు పట్టించుకోలేదని, మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకుని, డబుల్ లైన్ రోడ్డు ను దూర దృష్టి తో ఫోర్ లైన్ రోడ్డు గా మార్చి, రూ.237 కోట్ల నిధులు తీసుకువచ్చారని అన్నారు. మఖ్తల్ నుంచి సింగారం గేట్ వరకు మధ్యలో డివైడర్ ఏర్పాటు తో... మొక్కలు నాటి, దారి పొడవునా లైట్లతో అత్యాధునిక స్థాయిలో కేవలం 8 నెలల్లో పూర్తి చేసేలా పనులు సాగుతాయని అన్నారు. గత ప్రభుత్వంలో ఇద్దరు ఎమ్మెల్యేలు రహదారి గుండా ప్రయాణించినా నారాయణపేట రహదారి బాగు చేయలేదని, మంత్రి వాకిటి శ్రీహరి దూర దృష్టి తో 25 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫోర్ లైన్ రోడ్డు కు శ్రీకారం చుట్టి, 8 నెలల్లో పూర్తి చేసి చూపిస్తారని అన్నారు. వేల కోట్లు తీసుకువచ్చి, నియోజకవర్గం ను మంత్రి వాకిటి శ్రీహరి గారు అభివృద్ధి చేస్తున్నారని, ప్రజలు అండగా నిలిచి, పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
    కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ వల్లంపల్లి లక్ష్మణ్, జిల్లా నాయకులు నారాయణ, శంకర్, కర్రెమ్ అంజప్ప, బహదూర్, సురేష్,
    తదితరులు పాల్గొన్నారు.