Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బెల్జియంపై 2-1 తేడాతో విక్ట‌రీ..

    Author VENKATESH | 11 Jul 2026, 12:57 PM | Sports
    బెల్జియంపై 2-1 తేడాతో విక్ట‌రీ..

    ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్(FIFA World Cup) సెమీస్‌లోకి స్పెయిన్ ప్ర‌వేశించింది. క్వార్ట‌ర్స్ మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో బెల్జియంపై గెలుపొందింది. స‌బ్‌స్టిట్యూట్ ప్లేయ‌ర్ మైకేల్ మెరినో ఆఖ‌రి నిమిషాల్లో గోల్ కొట్టి.. స్పెయిన్ శిబిరంలో సంబ‌రాలు నింపాడు. ప్రీ క్వార్ట‌ర్స్‌లో పోర్చుగ‌ల్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ మెరినో చివ‌రి క్ష‌ణాల్లో గోల్ చేసి అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. బెల్జియం గోల్ కీప‌ర్ గాయం వ‌ల్ల‌ త‌ప్పుకోవ‌డంతో.. బ్యాక‌ప్ కీప‌ర్‌గా వ‌చ్చిన లెమ్మెన్స్‌ బంతిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మ్యాడు. ఆ కీప‌ర్‌ను తాకిన బంతి.. మ‌ళ్లీ ముందుకు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో మెరినో దాన్ని గోల్‌గా మ‌లిచాడు. గోల్ పోస్టు రూఫ్ లోప‌ల‌ ఆ బంతి త‌గిలింది. ఆట 88వ నిమిషంలో ఆ గోల్ వ‌చ్చింది. తొలుత స్పెయిన్ జ‌ట్టులో ఫాబియానా రూయిజ్ 30వ నిమిషంలో గోల్ చేశాడు. అయితే బెల్జియం ప్లేయ‌ర్ డీ కేటిలేరి 41వ నిమిషంలో గోల్ చేశాడు. సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్పెయిన్‌.. టోర్న‌మెంట్ ఫ‌వ‌రేట్ ఫ్రాన్స్‌తో ఈ శుక్ర‌వారం త‌ల‌ప‌డ‌నున్న‌ది.