Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బూత్ లెవల్ అధికారులు సమర్థంగా పనిచేస్తేనే ‘సర్’ విజయవంతం..!

    Author VENKATESH | 10 Jul 2026, 08:37 PM | TELANGANA
    బూత్ లెవల్ అధికారులు సమర్థంగా పనిచేస్తేనే ‘సర్’ విజయవంతం..!

    ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ విజయవంతం కావాలంటే బూత్ లెవల్ అధికారు లు (BLOలు) మరింత సమర్ధంగా పనిచేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో నియమించిన బూత్ లెవల్ అధికారులకు సర్ ప్రక్రియపై పూర్తి అవగాహన లేదని, అవసరమైన ఫారాలు కూడా అందుబాటులో లేవనే విషయాన్ని ఆయన సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
    కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బీఆర్‌ఎస్ బృందం కీలక సూచలను చేసింది. ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో సాయంత్రం 4:.30 గంటలకు భేటీ సందర్భంగా ఎంపీ లు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి, మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ సర్‌పై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సర్‌ విషయంలో హైదరాబాద్‌లోనూ సమస్యలు గుర్తించిన తర్వాత కొంతమంది అధికారులను మార్చిన విషయాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు వినోద్ కుమార్ చెప్పారు.