Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మెల్‌బోర్న్‌లో మోదీకి ఘన స్వాగతం..

    Author VENKATESH | 09 Jul 2026, 04:28 PM | Array
    మెల్‌బోర్న్‌లో మోదీకి ఘన స్వాగతం..

    ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి మెల్‌బోర్న్‌ మార్వెల్‌ స్టేడియంలో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. 'మెల్‌బోర్న్‌ మీట్స్‌ మోదీ' పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి 30 వేల మందికిపైగా ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. దీంతో ఒక్కసారిగా స్టేడియమంతా కిక్కిరిసింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌.. మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
    ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. తనకు లభించిన ఆత్మీయ ఆతిథ్యం పట్ల ఆస్ట్రేలియా ప్రజలు, ప్రధాని ఆల్బనీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సిడ్నీలో గతంలో రెండుసార్లు ప్రవాస భారతీయులను కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు మోదీ. అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం ఉంటే, మెల్‌బోర్న్‌లో ఐకానిక్‌ స్టేడియం ఉందని పేర్కొన్నారు. అయితే.. నేడు మార్వెల్‌ స్టేడియంలో అభిమానుల సందడి నెలకొనడంతో 'ఈ షో హౌస్‌ఫుల్‌.. బ్లాక్‌బస్టర్‌' అని మోదీ వ్యాఖ్యానించగా.. అక్కడివారు ఒక్కసారిగా హర్షధ్వానాలతో హోరెత్తించారు. 'భారత్‌-ఆస్ట్రేలియా సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయి. ఈ బంధాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దడంలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకం. మెల్‌బోర్న్‌లోని అనేక ప్రాంతాలు ఇప్పుడు 'మినీ ఇండియా'గా గుర్తింపు పొందుతున్నాయి' అని మోదీ పేర్కొన్నారు.