Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి..

    Author VENKATESH | 09 Jul 2026, 12:38 PM | INTERNATIONAL
    అమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి..

    అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రసన్న అట్లూరి (25) న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించింది. స్నేహితులతో కలిసి ఆలయానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జులై 5వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది (Indian Student Dies in US).
    జులై 5న ప్రసన్న తన స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో యువతి కూడా ప్రాణాలు కోల్పోయింది. మరో యువతి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది (Road Accident USA).