Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సింగరేణి డిమాండ్లపై ఈ నెల 20 నుంచి నిరవధిక దీక్ష

    Author VENKATESH | 09 Jul 2026, 12:34 PM | TELANGANA
    సింగరేణి డిమాండ్లపై ఈ నెల 20 నుంచి నిరవధిక దీక్ష

    సింగరేణి బాయి బాటలో భాగంగా కార్మికులతో మమేకమవుతున్నట్లు టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిలో పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై యాజమాన్యం దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ విధానాలు, బకాయిల వల్ల సింగరేణిపై పెను భారం పడుతోందన్నారు. సింగరేణిలో ఆర్థిక సంక్షోభంతో పని ముట్లు కొనలేని దుస్థితి నెలకొందన్నారు. అధికారులకు ఓ రూల్, కార్మికులకు మరో రూల్‌లా యాజమాన్యం తీరు ఉందని మండిపడ్డారు.
    తెలంగాణ హక్కుగా ఉన్న బొగ్గు బ్లాక్‌లు కేంద్రంలోని బీజేపీ వైఖరి వల్ల ప్రైవేట్‌పరం అవుతున్నాయని కవిత విమర్శించారు. తెలంగాణ రాకముందు 62 వేల రెగ్యులర్ కార్మికుల సంఖ్య ఉండేదని.. నేడు 38 వేలకు తగ్గిందన్నారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం నెలలో రెండు సార్లు మెడికల్ బోర్డ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డ్ ద్వారా వారసత్వ ఉద్యోగాలు కొనసాగించాలన్నారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం డిపెండెంట్లపై స్పష్టత ఇవ్వకపోతే ఈనెల 20 నుంచి రామగుండంలో నిరవధిక దీక్ష చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు.