Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఈ20 పెట్రోల్ విధానంపై కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు

    Author VENKATESH | 08 Jul 2026, 09:20 PM | NATIONAL
    ఈ20 పెట్రోల్ విధానంపై కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు

    ఈ20 పెట్రోల్ (ఇథనాల్ కలిపిన పెట్రోల్) విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం సమర్థించుకున్నారు. కేంద్రం తెచ్చిన ఈ విధానంపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఈ20 పెట్రోల్‌ విధానంతో తన వ్యక్తిగత ప్రయోజనాలు ఏవీ ముడిపడిలేవని స్పష్టం చేశారు. తనకొచ్చే లాభం ఏదీ లేదని అన్నారు. ఈ ఇంధనంతో వాహనాలు దెబ్బతిన్నట్టు ఒక్క ఆధారమైనా చూపించాలని విమర్శకులకు సవాలు విసిరారు. ఇంధన దిగుమతులు తగ్గించి, పర్యావరణహిత ఇంధనాలను ప్రోత్సహించేందుకు ఈ20 పెట్రోల్‌ను తీసుకొచ్చామని చెప్పారు. ఈ విధానంతో రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు.