Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నిరంజన్ మృతి కలచివేసింది: పవన్ కల్యాణ్

    Author VENKATESH | 08 Jul 2026, 12:56 PM | TELANGANA
    నిరంజన్ మృతి కలచివేసింది: పవన్ కల్యాణ్

    జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిమాని చిన్నారి నిరంజన్ కన్నుమూశాడు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ చివరి కోరిక మేరకు గత నెల 17న పవన్ కల్యాణ్ హనుమకొండలోని అతని ఇంటికి వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిరంజన్ తుదిశ్వాస విడిచాడు.
    చిన్నారి మృతిపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది' అంటూ పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు.