Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అల్లు అర్జున్ ‘రాకా’లో ఛాన్స్ మిస్ చేసుకున్న బ్లాస్ట్ బ్యూటీ..

    Author VENKATESH | 08 Jul 2026, 11:55 AM | Cinema
     అల్లు అర్జున్ ‘రాకా’లో ఛాన్స్ మిస్ చేసుకున్న బ్లాస్ట్ బ్యూటీ..

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణె కథానాయికగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యాధునిక సాంకేతికత, భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తాజాగా దర్శకుడు అట్లీ చేసిన ఓ ఆసక్తికర వ్యాఖ్య ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ‘రాకా’లో ఒక కీలక పాత్ర కోసం యువ నటి ప్రీతీ ముకుందన్ను సంప్రదించినప్పటికీ, ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా ఆ అవకాశం దక్కలేదని అట్లీ స్వయంగా వెల్లడించారు.
    ప్రీతీ ముకుందన్ ఇటీవల విడుదలైన ‘బ్లాస్ట్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందంతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకుని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అంతకుముందు తెలుగు చిత్రం ‘కన్నప్ప’ లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ‘బ్లాస్ట్’ విజయానంతరం ఆమెకు వరుసగా పలు భాషల్లో అవకాశాలు వస్తుండటంతో ప్రస్తుతం ప్రీతీ బిజీ హీరోయిన్‌గా మారిపోయారు. తాజాగా జరిగిన ‘ఇదయం మురళీ’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన అట్లీ.. ‘రాకా’కు సంబంధించిన ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ప్రీతీ ముకుందన్‌ను ‘రాకా’లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సంప్రదించామని, అయితే అప్పటికే ఆమెకు వరుస సినిమా కమిట్‌మెంట్లు ఉండటంతో డేట్లు కుదరక ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయారని చెప్పారు.